తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాపై​ ఫిక్సింగ్ ఆరోపణలు.. పాక్ మాజీలు గుస్సా! - వసీమ్ అక్రమ్ న్యూస్

టీ20 ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​పై ఘన విజయం సాధించిన అనంతరం భారత జట్టుపై(IND vs AFG T20) మ్యాచ్​ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు పలువురు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు. ఈ మేరకు ట్విట్టర్​లో ట్రోల్స్​ చేశారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు.

wasim akram, waqar younis
వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్

By

Published : Nov 4, 2021, 12:19 PM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా టీమ్​ఇండియా తొలి విజయం నమోదు చేసింది. అఫ్గానిస్థాన్​పై(IND vs AFG T20) 66 పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు మ్యాచ్​ ఫిక్సింగ్​కు పాల్పడిందంటూ పలువురు పాకిస్థాన్​ క్రికెట్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పాక్​ మాజీలు వసీమ్ అక్రమ్(Wasim Akram News), వకార్ యూనిస్.. ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలు ఎందుకు చేస్తారో అర్థంకాదని వ్యాఖ్యానించారు.

"ఇలాంటి కుట్రపూరిత ఆరోపణలు ఎందుకు చేస్తారో తెలియదు. టీమ్​ఇండియా దృఢమైన జట్టు. టోర్నీ ప్రారంభంలో వాళ్లకు సమయం కలిసిరాలేదు అంతే."

-వసీమ్ అక్రమ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

"భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్​ ఫిక్సింగ్ జరిగిందంటూ వస్తున్న రూమర్స్​ను​ పట్టించుకోవద్దు. ఈ ఆరోపణల్లో అసలు అర్థమే లేదు."

-వకార్ యూనిస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

మెగా టోర్నీలో రెండు మ్యాచ్​లు ఓడిపోయినంత మాత్రాన టీమ్​ఇండియా మేటి జట్టు కాదని ఎలా అంటామని మరికొంతమంది పాక్ మాజీలు అభిప్రాయపడ్డారు.

ఆరోపణలు ఎందుకు?

టీ20 ప్రపంచకప్​ తొలి రెండు మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో సెమీస్​ అవకాశాలు దక్కించుకోవాలనే నెపంతో అఫ్గాన్​తో మ్యాచ్​లో భారత జట్టు ఫిక్సింగ్​కు పాల్పడిందని కొందరు పాక్ అభిమానులు భావిస్తున్నారు. టాస్​ ఓడిన తర్వాత అఫ్గానిస్థాన్​ కెప్టెన్ నబీకి ఫీల్డింగ్ ఎంచుకోమని టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ చెప్పాడని కొందరు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

హార్దిక్​ పాండ్యా క్యాచ్​ మిస్​ చేసిన తీరు చూస్తే అఫ్గాన్​ ఆటగాళ్లు అమ్ముడుపోయారన్న విషయం స్పష్టమవుతోందని మరికొందరు ట్వీట్​ చేశారు. ఈ నేపథ్యంలో పాక్ మాజీల వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, తొలి రెండు మ్యాచ్​ల్లోనూ టీమ్​ఇండియా టాస్​ ఓడింది. అలాగే, టాస్​ గెలిచిన జట్లు ముందుగా ఫీల్డింగ్​ చేసేందుకే ఆసక్తి చూపాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ కూడా అలా ఫన్నీగా అనుంటాడని చెబుతున్నారు భారత అభిమానులు.

మరోవైపు.. నవంబర్ 5న దుబాయ్ వేదికగా టీమ్​ఇండియా, స్కాట్లాండ్(IND vs SCO T20)​ మధ్య మ్యాచ్​ జరగనుంది. 8న నమీబియాతో తలపడనుంది కోహ్లీసేన.

ఇదీ చదవండి:

IND vs AFG T20: దుమ్మురేపిన భారత్.. హైలైట్స్ చూసేయండి!

ABOUT THE AUTHOR

...view details