తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND vs NZ T20: టాస్​ గెలిచిన న్యూజిలాండ్.. టీమ్​ఇండియా బ్యాటింగ్​ - భారత్ X న్యూజిలాండ్ టీ20

టీ20 ప్రపంచకప్​లో భాగంగా నేడు(అక్టోబర్ 31న) టీమ్​ఇండియాతో తలపడనుంది న్యూజిలాండ్. ఈ పోరులో భాగంగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్.

virat kohli, kane williamson
విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్

By

Published : Oct 31, 2021, 7:07 PM IST

Updated : Oct 31, 2021, 7:37 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం(అక్టోబర్ 31) దుబాయ్​ వేదికగా న్యూజిలాండ్​తో తలపడేందుకు సిద్ధమైంది టీమ్​ఇండియా. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్ ఇరు జట్లకూ (IND Vs NZ) చావో రేవో లాంటిదే. సెమీస్​ రేసులో నిలవాలంటే ఇకపై టీమ్​ఇండియా అన్ని మ్యాచ్​లూ గెలవాలి. అయితే.. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టీమ్​ఇండియాపై కివీస్​కు ఎదురులేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. ఈ నేపథ్యంలో ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే భారత్ ముందు ఓ మంచి ఉపాయం ఉంది. అదే.. గతేడాది న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్​ను గుర్తుచేసుకోవడం.

టీమ్​ఇండియా:
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, షమి, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.

న్యూజిలాండ్​:

మార్టిన్​ గప్తిల్​, డారిల్​ మిచెల్​, కేన్​ విలియమ్సన్​(కెప్టెన్​), జేమ్స్​ నీషమ్​, డేవన్​ కాన్వే(వికెట్​ కీపర్​), గ్లెన్ ఫిలిప్స్​, మిచెల్​ సాంట్నర్​, ఇష్​ సోధి, టిమ్​ సౌథీ, ఆమ్​ మిల్నే, ట్రెంట్​ బౌల్ట్

ఇదీ చదవండి:

టీమ్​ఇండియా.. 18 ఏళ్ల చెత్త రికార్డును చెరిపేస్తుందా?

T20 World Cup: 'ఈ మార్పులు చేస్తే టీమ్​ఇండియాదే విజయం'

Last Updated : Oct 31, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details