భారత్ అభిమానులు ఎంతో ఆసక్తితో చూసిన మ్యాచ్ ఇది. మనం సెమీస్ చేరాలంటే అఫ్గాన్ జట్టు గెలవాలని కోరుకున్న టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీస్‌లో అడుగుపెట్టింది.
అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి - cricket news
అఫ్గానిస్థాన్‌పై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఫలితంగా భారత్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
న్యూజిలాండ్
అబుదాబీలో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 124/8 స్కోరు చేసింది. నజీబుల్లా(73) మినహా అందరూ విఫలమయ్యారు.
అనంతరం ఛేదనలో కివీస్ పూర్తి అధిపత్యం చూపించింది. 18 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 40, కాన్వే 36, గప్తిల్ 28 పరుగులతో ఈగెలుపులో కీలకపాత్ర పోషించారు.
Last Updated : Nov 7, 2021, 6:49 PM IST