టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). తద్వారా నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుని సెమీ ఫైనల్ రేసులో మరో అడుగు ముందుకేసింది. అయితే కోహ్లీసేన నాకౌట్‌కు అర్హత సాధించాలంటే ఆదివారం న్యూజిలాండ్‌పై అఫ్గానిస్థాన్(nz vs afg t20) విజయం సాధించాల్సి ఉంటుంది. స్కాట్లాండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం జడేజాకు ఇదే ప్రశ్న ఎదురవగా ఆసక్తికర సమాధానమిచ్చాడు జడ్డూ.
ఇంకేం చేస్తాం.. బట్టలు సర్దుకోవడమే: జడేజా ఫన్నీ రిప్లై - Ravindra Jadeja
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). మ్యాచ్ ముగిశాక మీడియా ముందు మాట్లాడటానికి వచ్చిన స్పిన్నర్ జడేజాకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి తనదైన శైలిలో సమాధానమిచ్చాడు జడ్డూ.
మ్యాచ్ ముగిశాక మీడియా వద్దకు మాట్లాడేందుకు వచ్చాడు జడేజా. ఆ సమయంలో ఓ విలేకరి.. 'న్యూజిలాండ్‌పై అఫ్గాన్ గెలవకపోతే ఏం చేస్తారు?' అని అడగ్గా.. 'ఇంకేముంది ఇంటికి వెళ్లేందుకు బ్యాగులు సర్దుకోవడమే' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్(ind vs sco t20)లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు చెలరేగడం వల్ల ఏ దశలోనూ కోలుకోలేదు. టీమ్ఇండియా బౌలర్లలో జడేజా, షమీ చెరో మూడు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా 2, అశ్విన్ 1 వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 86 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది కోహ్లీసేన. ఓపెనర్లు రోహిత్ (30), రాహుల్ (50) స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఘన విజయంతో గ్రూప్-2లో అత్యధిక నెట్ రన్‌రేట్ కలిగిన జట్టుగా కొనసాగుతోంది భారత్.