పాకిస్థాన్ క్రికెట్ (Pakistan Cricket News) జట్టంటేనే అనిశ్చితికి మారు పేరు. కానీ టీ20 ప్రపంచకప్ (T20 World Cup) తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు ప్రదర్శన చూశాక.. ఇన్నాళ్లూ మనం చూసిన పాకిస్థాన్ ఇదేనా అనిపిస్తోంది. ఆ జట్టు పట్టుదలగా, ఇంత ఆత్మవిశ్వాసంతో ఆడి చాలా కాలం అయిపోయింది. ఉన్నట్లుండి వచ్చిన ఈ మార్పు చూసి క్రికెట్ ప్రపంచం విస్మయానికి గురవుతోంది. 90వ దశకంలో పాకిస్థాన్ క్రికెట్ వైభవం గురించి అందరికీ తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో సమష్టిగా సత్తా చాటిన ఆ జట్టు 1992 ప్రపంచకప్ (Pakistan World Cup) గెలవడమే కాక.. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని చలాయించిందా జట్టు. ఇమ్రాన్ (Imran Khan News) జట్టులో నెలకొల్పిన సంస్కృతి ఆ తర్వాత కూడా కొనసాగింది. అతడి నిష్క్రమణ అనంతరం కూడా అక్రమ్, వకార్, ఇంజమామ్, అన్వర్, యూసుఫ్ లాంటి దిగ్గజాలతో కూడిన జట్టు ఎంతో ప్రమాదకరంగా కనిపించేది. నిలకడగా ఆడేది.
అతలాకుతలం..
కానీ ఈ దిగ్గజాలు ఒక్కొక్కరే నిష్క్రమించడం, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో అవ్యవస్థ, రాజకీయాలు.. లాంటి కారణాలతో ఆ జట్టు గతి తప్పింది. 2007 ప్రపంచకప్‌లో (Pakistan World Cup) ఘోర వైఫల్యానంతరం ఆ జట్టు మరింత క్షీణించింది. ఎప్పటికప్పుడు ప్రతిభావంతులైన క్రికెటర్లు జట్టులోకి వస్తున్నా.. వారిని సరైన దారిలో నడిపించే.. జట్టుకు, పాకిస్థాన్ క్రికెట్‌కు దిశా నిర్దేశం చేసేవారు కరవై ఆ జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారైంది. సెలక్షన్ కమిటీలో రాజకీయాల కారణంగా పదే పదే జట్టును, కెప్టెన్లను మార్చడం కూడా పాకిస్థాన్ జట్టులో అనిశ్చితికి దారి తీసింది. అలాగని పాక్ ప్రదర్శన పూర్తిగా పడిపోలేదు. ఎప్పటికప్పుడు జట్టులోకి ప్రతిభావంతులు వస్తుండటం వల్ల అడపాదడపా మంచి విజయాలే సాధించిందా జట్టు. కాకపోతే నిలకడ అన్నదే లేకపోయింది. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆ జట్టులో కనిపిస్తోంది అదే.
ప్రతిభకు లోటు లేకున్నా..
ఒకప్పుడు ఛేదన అంటేనే తడబడిపోయే, ఒత్తిడికి గురయ్యే జట్టుగా పాకిస్థాన్‌కు పేరుండేది. ఒకట్రెండు వికెట్లు పడ్డాయంటే మంచి స్థితి నుంచి ఒకేసారి కుప్పకూలిపోయి మ్యాచ్‌లు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. భారత్‌పై (Ind Vs Pak T20 World Cup 2021) 150 పైచిలుకు లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్ కోల్పోకుండా ఛేదించడం అనూహ్యం. భారత బౌలర్లు ఎంతగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా పాక్ ఓపెనర్లు లొంగలేదు. ఇక న్యూజిలాండ్‌తో (PAK Vs NZ) మ్యాచ్‌లో 69 పరుగులకే 4 కీలక వికెట్లు పడ్డా ఆ జట్టు కోలుకుంది. మాలిక్ అండతో అసిఫ్ అలీ చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఛేదనల్లో సమీకరణం తేలిగ్గా ఉన్నప్పటికీ ఒత్తిడికి గురై మ్యాచ్‌లు అప్పగించేసే జట్టు.. టపటపా వికెట్లు పడిపోయి, సాధించాల్సిన రన్‌రేట్ 9 దాటిపోయిన సమయంలో దృఢంగా నిలబడి మ్యాచ్ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అతడి వల్లేనా?