ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు తొలి గెలుపు. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై66 పరుగులల తేడాతో అద్భుత విజయం సాధించింది.
టీమ్ఇండియా ఘనవిజయం.. ప్రపంచకప్‌లో తొలి గెలుపు - క్రికెట్ లేటెస్ట్ న్యూస్
అఫ్గాన్ జట్టుపై గెలిచిన టీమ్ఇండియా.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే భారత జట్టు సెమీస్ అవకాశాలు.. మనతో పాటు ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఉంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా కేఎల్ రాహుల్(69), రోహిత్ శర్మ(74) అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 140 భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్(27*), హార్దిక్ పాండ్య(35*) తమదైన చెలరేగిపోయారు. దీంతో 211 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ జట్టుకు నిర్దేశించింది భారత్.
కానీ ఛేదనలో అఫ్గానిస్థాన్ తడబడింది. కేవలం ఓవర్లన్నీ ఆడి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. హజ్రతుల్లా 13, రెహమానుల్లా 19, గుల్బాదిన్ 18, నజీబుల్లా 11, మహ్మమద్ నబీ , కరీమ్ నామమాత్ర స్కోరే చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 2, షమి, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.