తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అశ్విన్​ను తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలి'

టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021) తుదిజట్టులో సీనియర్ స్పిన్నర్ రవి అశ్విన్(ravi ashwin t20 world cup)​ను తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ వెంగ్​సర్కార్(vengsarkar news). అతడిని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నించాడు. దీనిపై విచారణ జరిపించాలని అభిప్రాయపడ్డాడు.

Ashwin
అశ్విన్​

By

Published : Nov 2, 2021, 12:15 PM IST

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో టీమ్‌ఇండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(ravi ashwin t20 world cup)ను ఎందుకు ఆడించడం లేదని మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపని మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని కివీస్‌తో మ్యాచ్‌లోనూ ఆడించారు. దీంతో రెండు మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా అతడు నిరూపించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ స్పిన్నర్‌ను కాదని అతడిని ఎందుకు తీసుకున్నారని వెంగ్‌సర్కార్‌ అసహనం వ్యక్తం చేశారు.

"అశ్విన్‌(ravi ashwin t20 world cup)ను చాలా రోజుల నుంచి ఎందుకు పక్కనపెడుతున్నారు? ఈ విషయంపై విచారణ జరపాలి. ఫార్మాట్లకు అతీతంగా అత్యుత్తమ స్పిన్నర్‌గా అతడు రాణిస్తున్నాడు. అలాగే తన ఖాతాలో 600కు పైగా అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి. జట్టులో అత్యంత అనుభవం ఉన్న స్పిన్నర్‌ అతడే. అలాంటిది అతడిని ఎందుకు తీసుకోవడం లేదు? ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఒక్క మ్యాచ్‌లో ఆడించలేదు. ఇది నాకస్సలు అర్థంకావడం లేదు. అతడిని ఆడించనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ఇది పెద్ద మిస్టరీలా ఉంది. అలాగే రెండు మ్యాచ్‌ల్లోనూ ఆటగాళ్లంతా నిస్సారంగా కనిపించారు. బయోబబుల్‌ వల్ల అలా కనిపించారో ఏమో నాకు తెలియదు కానీ, చాలా కాలంగా ఆటగాళ్లలో ఇలాంటి బాడీలాంగ్వేజ్‌ చూడలేదు" అని వెంగ్‌సర్కార్‌(vengsarkar news) ఓ మీడియాతో చెప్పుకొచ్చారు.

ఇవీ చూడండి: 'టీమ్ఇండియా బ్యాటింగ్​ షాక్​కు గురిచేసింది'

ABOUT THE AUTHOR

...view details