తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup 2021: రషీద్​ ఖాన్​ అరుదైన రికార్డు - పాకిస్థాన్

అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan News). ఈ ఫార్మాట్​లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన బౌలర్​గా నిలిచాడు.

rashid khan news
రషీద్​ ఖాన్

By

Published : Oct 30, 2021, 7:37 AM IST

అఫ్గానిస్థాన్​ స్టార్​ స్పిన్నర్​ రషీద్​ ఖాన్ (Rashid Khan News)​ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు (Fastest 100 Wickets in T20I) తీసిన ఘనత సొంతం చేసుకున్నాడు. కేవలం 53 మ్యాచ్​ల్లోనే ఈ మార్క్​ను అందుకోవడం విశేషం.

రషీద్​ ఖాన్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్​తో మ్యాచ్​ (Pak vs Afg) సందర్భంగా మహ్మద్ హఫీజ్​ వికెట్​ తీసిన రషీద్​.. 100 వికెట్ల క్లబ్​లో చేరాడు. దీంతో 76 మ్యాచుల్లో 100 వికెట్లు పడగొట్టిన శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేశాడు.

ఓడిన అఫ్గాన్..

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో అఫ్గాన్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాక్. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. బాబర్‌ అజామ్‌ (51; 47 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫకార్ జమాన్ (30), షోయబ్ మాలిక్‌ (19) ఫర్వాలేదనిపించారు. 19వ ఓవర్‌లో ఆసిఫ్‌ అలీ (25) నాలుగు సిక్స్‌లు బాది పాక్‌కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు, ముజీబుర్, నబీ, నవీన్ ఉల్ హక్‌ తలో వికెట్ తీశారు. మ్యాచ్​ పూర్తి వివరాల కోసం..

ఇదీ చూడండి:నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. ఐరిష్ బౌలర్ సూపర్ రికార్డు

ABOUT THE AUTHOR

...view details