తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 World Cup: 'ఈ మార్పులు చేస్తే టీమ్​ఇండియాదే విజయం' - టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) టీమ్​ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. పాకిస్థాన్​తో తొలి మ్యాచ్​లో ఓడి కాస్త వెనకడుగు వేసినట్టు కనిపిస్తున్నా.. కివీస్​పై (Ind Vs Nz) ఆదివారం జరిగే పోరులో గెలిచేందుకు అవకాశముందంటున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు బీ. మోహన్. ఇంకా ఆయన ఏమన్నారంటే?

T20 World Cup
టీ20 ప్రపంచకప్

By

Published : Oct 31, 2021, 2:24 PM IST

టీ-20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఆదివారం రాత్రి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు (Ind Vs Nz) తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో (Ind Vs Pak) భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. న్యూజిలాండ్​పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల భారత జట్టు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. న్యూజిలాండ్‌ జట్టు పటిష్టంగా లేదని.. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో (T20 World Cup 2021 India Squad) కొన్ని మార్పులు చేయాలని ప్రముఖ క్రికెట్‌ విశ్లేషకులు బీ.మోహాన్‌ సూచించారు. ఫిట్‌గా లేని హార్థిక్‌ పాండ్యను (Hardik Pandya News) తప్పించి ఆ స్థానంలో శార్థూల్ ఠాకూర్‌ను ఆడిపించాలంటున్న మోహాన్‌తో మా ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

టీమ్​ఇండియా విజయావకాశాలపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు మోహన్ ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details