ఈనెల 14న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో(T20 world cup final 2021) మైదానంలో పూర్తి స్థాయిలో ప్రేక్షకులు కనిపించనున్నారు. ఈ మేరకు వంద శాతం సీటింగ్ సామర్థ్యంతో మ్యాచ్ నిర్వహించేందుకు.. బీసీసీఐ, ఎమిరేట్స్ క్రికెట్ బోర్టు అంగీకరించాయి. ఇప్పటివరకు 70శాతం సామర్థ్యంతోనే మ్యాచ్‌లను నిర్వహించారు. అయితే ఫైనల్‌కు మాత్రం దుబాయి మైదానంలో పూర్తిగా 25 వేల మంది ప్రేక్షకులకు అనుమతించనున్నారు. కొవిడ్ నిబంధనల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఈ టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup semi final).. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరాయి. బుధవారం జరగనున్న తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 11న జరగనున్న రెండో సెమీస్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 14న దుబాయి వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.