టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) టీమ్ఇండియా మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో కంగుతిని సెమీస్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకున్న కోహ్లీసేన.. అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్‌తో (India Vs Afghanistan World Cup) తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించి.. సాంకేతికంగా ఉన్న కాసిన్నిఅవకాశాలను నిలబెట్టుకోవాలని టీమ్ఇండియా భావిస్తుండగా.. వరుసగా రెండు ఓటములతో డీలాపడ్డ భారత్‌ను మరోదెబ్బ తీయాలని అఫ్గాన్ వ్యూహాలు రచిస్తోంది.
కాగితంపై బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉన్న టీమ్ఇండియా.. అసలు మ్యాచ్‌లోకి వచ్చేసరికి డీలాపడుతోంది. వార్మప్ మ్యాచ్‌లలో అదరగొట్టిన మన బ్యాటర్లు, పాకిస్థాన్ (Ind Vs Pak), న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లలో ఒత్తిడికి గురై బ్యాట్లెత్తేశారు. ఇదే సమయంలో (Ind Vs Afg Playing 11) జట్టు ఎంపిక, అశ్విన్‌ను పక్కనపెట్టడంపై కెప్టెన్ కోహ్లీపై (Virat Kohli News) తీవ్రవిమర్శలు వ్యక్తమవగా.. టీమ్ కూర్పు ఎలా ఉంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
కూర్పు ప్రధాన సమస్య!
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో (Ind Vs Nz) బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై (Team India Batting Order) విమర్శలు వ్యక్తమైన వేళ.. అఫ్గాన్‌తో పోరులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగే.. అవకాశముంది. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వస్తే.. సూర్య, ఇషాన్ కిషన్ జట్టులో ఉండే అవకాశముంది. రెండు మ్యాచ్‌లలో 35 బంతులను ఎదుర్కొని 31 పరుగులు చేసిన హార్థిక్ పాండ్యను పక్కనబెట్టొచ్చు. మిస్టరీ స్పినర్ వరుణ్ చక్రవర్తి.. మ్యాజిక్ పనిచేయని నేపథ్యంలో.. అశ్విన్‌ను తుదిజట్టులో ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్గాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షెజాద్‌లకు పెద్దగా ఫుట్‌వర్క్ లేని నేపథ్యంలో.. అశ్విన్‌ను ఆడటంలో తడబడే అవకాశం ఉంది.
మరోవైపు.. స్కాట్లాండ్, నమీబియాలపై భారీ విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్ (Afghanistan Cricket News).. పాకిస్థాన్‌ను దాదాపు ఓడించినంత పనిచేసింది. ఇదే ఊపుతో.. భారత్‌పై విజయం సాధించి సెమీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలనే కసితో ఉంది. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తమ టీ20 అనుభవాన్ని అంతా ఉపయోగించి.. భారత్‌కు భంగపాటు కలిగించాలనే పట్టుదలతో ఉన్నారు. టాస్ గెలిస్తే.. కోహ్లీ ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశముంది. ఒక వేళ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది.అఫ్గాన్ స్పిన్నర్లను ఎదుర్కొని మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు ఏమాత్రం స్కోరు సాధిస్తారనే అంశమై ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి:T20 World Cup: భారత్ ఘోర పరాజయం.. సెమీస్ ఆశలు గల్లంతు!