టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా అక్టోబర్ 31న భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే కసితో ఉంది. కీలకమైన ఈ పోరుకు భారత జట్టు రెండు మార్పులను చేయాలని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సూచించారు. హార్దిక్ పాండ్య స్థానంలో ఇషాన్ కిషన్‌ని, భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని జట్టులోకి తీసుకోవాలని సలహా ఇచ్చారు.
"పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య భుజానికి గాయమైంది. దీంతో అతడు బౌలింగ్ చేయకపోతే.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ని హార్దిక్ స్థానంలో తీసుకోవాలని సూచిస్తా. భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ పేరుని పరిశీలించవచ్చు. అలాగని భారీ మార్పులు చేస్తే భారత జట్టు మ్యాచ్ గురించి భయపడుతోందని న్యూజిలాండ్ భావించే అవకాశం ఉంది"