టీ20 ప్రపంచకప్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డును ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు ఇవ్వడంపై పాకిస్థాన్ దిగ్గజ బౌలర్, మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ అవార్డు పాక్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు దక్కుతుందని భావించానని అన్నాడు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశాడు. వార్నర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించాడు.
ఈ టోర్నీలో పాక్ ఆటగాడు బాబర్ అజామ్ 6 మ్యాచుల్లో 303 పరుగులు చేయగా.. వార్నర్ 7 మ్యాచుల్లో 289 పరుగులు చేశాడు.