టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) తుది దశకు చేరుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఫైనల్‌కు వెళ్లింది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, పాకిస్థాన్(pak vs aus t20) జట్లు నేడు (నవంబర్ 11) దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప(robin uthappa news) పాకిస్థాన్ జట్టు ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రెండు జట్లు బాగా ఆడుతున్నాయని.. అయితే, పాక్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి ముందుకుసాగుతోందని.. అందుకే ఆ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందని పేర్కొన్నాడు.
"ఆస్ట్రేలియా, పాకిస్థాన్(pak vs aus t20) జట్ల మధ్య జరుగునున్న రెండో సెమీఫైనల్‌లో పాక్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఆ ఒక్క జట్టే అజేయంగా కొనసాగుతోంది. అది పాక్‌కు కలిసొస్తుందో లేదో తెలియదు. కానీ, అదే జోరుని కొనసాగిస్తే మాత్రం విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కాగా, ఆస్ట్రేలియా కూడా మెరుగ్గా రాణిస్తోంది. వాళ్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమదైన రోజున ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలదు. ప్రత్యేకించి ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుకు గొప్ప రికార్డుంది. ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తోంది."