టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్(ind vs nz 2021)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది టీమ్ఇండియా. అయితే ఈ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసిన రిచర్డ్ కెటిల్‌బరో(richard kettleborough vs india)కు భారత జట్టు ఓటమికి సంబంధం ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అతడి వల్లే టీమ్ఇండియా ఓడిపోయిందని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే అందుకు కారణం రిచర్డ్ తప్పుడు అంపైరింగ్ కాదు. అతడు అంపైరింగ్ చేసిన ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడమే అందుకు కారణం.
ఇదీ కథ?
రిచర్డ్ కెటిల్‌బరో 2014 టీ20, 2015 వన్డే, 2016 టీ20, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత్ ఆడిన నాకౌట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయగా.. ఇందులో అన్నింటిలోనూ ఓడిపోయింది టీమ్ఇండియా. అలాగే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులోనూ కెటిల్‌బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్ కూడా ఓటమిపాలైంది ఇండియా. దీంతో ఈ అంపైర్‌పై ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు అభిమానులు. 'మా జట్టుకు శనిలా దాపురించావు అంటూ' కామెంట్లు పెడుతున్నారు.
ముందుగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ (23), జడేజా (26) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో 14.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది కివీస్. మిచెల్ 49 పరుగులతో తృటిలో అర్ధశతకం చేజార్చుకోగా.. విలియమ్సన్ (33*) చివరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.