తెలంగాణ

telangana

ETV Bharat / sports

డ్రెస్సింగ్​ రూమ్​లో రవిశాస్త్రి భావోద్వేగ సందేశం - రవిశాస్త్రి భావోద్వేగ సందేశం

టీమ్ఇండియా కోచ్​గా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నాడు రవిశాస్త్రి. టీ20 ప్రపంచకప్​(t20 world cup 2021)​లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్​.. కోచ్​గా అతడికి చివరిది. ఈ మ్యాచ్​లో విజయం సాధించిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్​లో జట్టు సభ్యులకు తన చివరి సందేశాన్ని అందించాడు రవి(ravi shastri t20 world cup). అలాగే తనపై నమ్మకముంచిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్​కు కృతజ్ఞతలు తెలిపాడు.

Ravi Shastri
రవిశాస్త్రి

By

Published : Nov 9, 2021, 12:19 PM IST

టీమ్ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)​లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచే కోచ్‌గా రవిశాస్త్రికి చివరిది. ఈ మ్యాచ్ ముగిశాక డ్రెస్సింగ్ రూమ్​లో ఆటగాళ్లకు తన చివరి సందేశాన్ని ఇచ్చాడు రవి(ravi shastri t20 world cup). కొంతకాలంగా గొప్పగా పోరాడారని కితాబిచ్చాడు.

"జట్టుగా మీరంతా నా అంచనాల్ని మించి రాణించారు. కొన్నేళ్లుగా విదేశీ పర్యటనల్లో అన్ని ఫార్మాట్లలో ప్రతి జట్టును ఓడించాం. గొప్ప జట్టుగా ఎదిగాం" అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు రవి.

శ్రీనివాసన్​కు కృతజ్ఞతలు

భారత జట్టుకు అతడిని కోచ్‌గా నియమించిన అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్‌(ravi shastri srinivasan)కు శాస్త్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా 1-3 తేడాతో ఘోర పరాజయం పాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో శ్రీనివాసన్ తనపై నమ్మకంతో.. జట్టును బలోపేతం చేసే బాధ్యతలను అప్పగించాడని పేర్కొన్నాడు.

"ఇన్నేళ్లుగా భారత జట్టుకు కోచ్‌గా కొనసాగడం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్‌లో నాకు ఇదే చివరి రోజని తెలుసు. భారత క్రికెట్‌కు సేవలందించే గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బీసీసీఐ(bcci news)కి ధన్యవాదాలు. కోచ్‌గా నేను చేయగలిగినంతా చేశాననుకుంటున్నా. నా సామర్థ్యంపై నమ్మకంతో టీమ్ఇండియా కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన శ్రీనివాసన్‌(ravi shastri srinivasan)కు ప్రత్యేక ధన్యవాదాలు. నా పనితీరుపై ఆయనకు నమ్మకమెక్కువ. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

2014లో టీమ్​ఇండియా డైరెక్టర్‌గా నియమితుడైన రవిశాస్త్రి(ravi shastri t20 world cup).. 2017లో కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2019 ఆగస్టులో మరోసారి అతడి పదవీ కాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి

'వచ్చే ప్రపంచకప్​లో రాణించాలంటే ఇలా చేయండి'

'బబుల్​లో ఉంటే బ్రాడ్​మన్​కు అయినా కష్టమే'

ABOUT THE AUTHOR

...view details