తెలంగాణ

telangana

ETV Bharat / sports

Kohli Azam: 'కోహ్లీ రికార్డులను బ్రేక్​ చేయడమే అతడి పని' - టీ20 ప్రపంచకప్​

అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు పాకిస్థాన్​ సారథి బాబర్ అజామ్. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్​గా (Fastest 1000 Runs in T20 as Captain) నిలిచాడు. దీంతో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ రికార్డును (Virat Kohli Records) అతడు బ్రేక్ చేశాడు.

virat kohli news
విరాట్​ కోహ్లీ

By

Published : Oct 30, 2021, 1:06 PM IST

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న కెప్టెన్​గా (Fastest 1000 Runs in T20 as Captain) నిలిచాడు పాకిస్థాన్ స్టార్​ బాబర్ అజామ్ (Babar Azam News). టీ20 ప్రపంచకప్​లో భాగంగా (T20 World Cup 2021) శుక్రవారం అఫ్గానిస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా చేసిన అర్ధశతకంతో అతడు ఈ ఘనత సాధించాడు. దీంతో టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ (30 మ్యాచుల్లో వెయ్యి పరుగులు) పేరిట ఉన్న రికార్డును (Virat Kohli Records) బ్రేక్​ చేశాడు. 26 ఇన్నింగ్స్​ల్లోనే బాబార్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఈ ఏడాది తొలినాళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్​గా నిలిచాడు బాబార్ (Fastest 2000 Runs in T20 International). అంతకుముందు ఈ రికార్డు కూడా కోహ్లీ పేరిటే ఉండేది. 56 ఇన్నింగ్స్​ల్లో కోహ్లీ ఈ మైలురాయికి చేరుకుంటే.. 52 మ్యాచుల్లోనే బాబర్ (Babar Azam Record) దానిని అధిగమించాడు.

రికార్డులను బ్రేక్​ చేయడమే పనిగా..

ఈ నేపథ్యంలో బాబర్​ను (Babar Azam News) ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా. కోహ్లీ రికార్డులను బ్రేక్ చేయడం బాబార్ అలవాటుగా చేసుకున్నాడని కొనియాడాడు.

"కోహ్లీని బాబార్ ఛేజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. విరాట్ ఏదైనా రికార్డును సృష్టిస్తే దానిని అధిగమించడానికి వెనుకే వస్తున్నాడు. అతడు ఎంతో అద్భుతంగా ఆడుతున్నాడు."

- ఆకాశ్ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

సెమీస్​కు చేరువైన పాక్..

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్​లో (Pak Vs Afg T20) అఫ్గాన్​పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాక్. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. బాబర్‌ అజామ్‌ (51; 47 బంతుల్లో 4 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫకార్ జమాన్ (30), షోయబ్ మాలిక్‌ (19) ఫర్వాలేదనిపించారు. 19వ ఓవర్‌లో ఆసిఫ్‌ అలీ (25) నాలుగు సిక్స్‌లు బాది పాక్‌కు విజయాన్ని అందించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు, ముజీబుర్, నబీ, నవీన్ ఉల్ హక్‌ తలో వికెట్ తీశారు. దీంతో పాటు ఇదివరకే టీమ్​ఇండియా, న్యూజిలాండ్​పై వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాక్.. సెమీస్​కు మరింత చేరువైంది.

ఇవీ చూడండి:

చరిత్ర తిరగరాసిన బాబర్​ ఆజామ్​.. తండ్రి కన్నీటి పర్యంతం

T20 world cup 2021: కెప్టెన్స్​ కోహ్లీ-బాబర్​ రికార్డ్స్​ ఇవే​

T20 World Cup: వారికి అవకాశమిస్తేనే టీమ్​ఇండియాకు విజయం!

ABOUT THE AUTHOR

...view details