టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా ఇప్పటివరకు టీమ్ఇండియా ఒకే మ్యాచ్ ఆడింది. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌పై(IND vs PAK T20) 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును తక్కువ అంచనా వేయడం సరికాదని అన్నాడు మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఒక్కసారి ఊపందుకుంటే.. కోహ్లీసేనను ఏ జట్టు ఎదుర్కోలేదని అని ట్వీట్ చేశాడు.
"టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ముందుకెళ్లడం కష్టమని చాలా మంది భావిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్క ఓటమితోనే ఈ నిర్ణయానికి రావడం సరికాదు. రాబోయే మ్యాచ్ భారత జట్టు భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక్కసారి భారత్ ఊపందుకుంటే ఇక వారిని ఆపడం ఎవరివల్లా కాదు."
--దినేశ్ కార్తీక్, టీమ్ఇండియా మాజీ ఆటగాడు.
మరికొన్ని గంటల్లో టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌తో(IND vs NZ T20 Match) తలపడనుంది. ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకూ చాలా ముఖ్యం. ఈ పోరులో నెగ్గిన వారికే సెమీస్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.