టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మిచెల్ 49 పరుగులతో అదరగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చినా జట్టుకు శుభారంభం దక్కలేదు. ఇషాన్(4), కేఎల్ రాహుల్(18), రోహిత్ శర్మ(14), విరాట్ కోహ్లీ(9) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం రిషభ్ పంత్ 12 పరుగుల వద్ద మిల్నే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.