టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో ఇంగ్లాండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సోమవారం శ్రీలంక(eng vs sl t20)తో జరిగిన పోరులో 26 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20ల్లో కెప్టెన్‌గా ఓ జట్టుకు అత్యధిక విజయాలందించిన రికార్డును సాధించాడు ఇయాన్ మోర్గాన్(eoin morgan t20 captaincy record). తద్వారా టీమ్ఇండియా సారథి ధోనీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.
ధోనీని దాటేసిన మోర్గాన్.. టీ20ల్లో అత్యుత్తమ సారథిగా! - ధోనీని దాటేసిన మోర్గాన్
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది ఇంగ్లాండ్. సోమవారం శ్రీలంక(eng vs sl t20)పై ఘనవిజయం సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో విజయంతో టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన సారథిగా రికార్డు నెలకొల్పాడు మోర్గాన్(eoin morgan t20 captaincy record).
మొత్తంగా తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌కు 43 (68 మ్యాచ్‌ల్లో) విజయాలను అందించాడు మోర్గాన్(eoin morgan t20 captaincy record). ధోనీ (72 మ్యాచ్‌ల్లో), అఫ్గాన్ సారథి అస్గర్ అఫ్గాన్ (52 మ్యాచ్‌ల్లో) 42 విజయాలతో రెండో స్థానంలో నిలిచారు. చెరో 29 విజయాలతో కోహ్లీ, సర్ఫరాజ్ అహ్మద్ మూడో స్థానంలో ఉన్నారు.
ఈ మ్యాచ్(eng vs sl t20)లో మొదట టాస్ ఓడిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభించింది. జాస్ బట్లర్ అద్వితీయ శతకం (101)తో జట్టును ఆదుకున్నాడు. మోర్గాన్ 40 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది ఇంగ్లీష్ జట్టు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు తడబడింది. అసలంక (21), రాజపక్సా (26), షనక (26), హసరంగ (34) పోరాడిన ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమవడం వల్ల 19 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది.