టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది పాకిస్థాన్(pak vs aus t20). దీంతో టోర్నీలో ఫైనల్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో అర్ధశతకంతో పాక్‌ను ఆదుకున్న ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్(mohammad rizwan news).. ఈ మ్యాచ్‌కు ముందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందాడు. దీంతో ఇతడు ఆసీస్‌తో పోరులో బరిలో దిగుతాడో? లేదో? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ మ్యాచ్‌కు ముందే అతడు కోలుకున్నట్లు ప్రకటన చేసింది పీసీబీ. అనంతరం బ్యాటింగ్‌లో అదరగొట్టాడు రిజ్వాన్(mohammad rizwan news) . మ్యాచ్ అనంతరం పాక్ ఓడిపోయాక.. రిజ్వాన్ ఐసీయూలో ఉన్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై స్పందించిన పాక్ బ్యాటింగ్ కోచ్ మాథ్యూ హెడెన్.. రిజ్వాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
"ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో సెమీస్ ముందు ఆస్పత్రిలో చికిత్స పొందాడు రిజ్వాన్. అతడో యోధుడు. అద్వితీయ పోరాటపటిమతో ఈ టోర్నీలో కీలకంగా వ్యవహరించాడు" అంటూ రిజ్వాన్‌కు కితాబిచ్చాడు హెడెన్.