తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరుదైన రికార్డు.. యూవీ సరసన మార్ష్​, హేజిల్​వుడ్​ - ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లైవ్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో విజయం సాధించిన ఆసీస్ జట్టులోని ప్లేయర్స్​​ మార్ష్​, హేజిల్​వుడ్​ ఓ అరుదైన రికార్డును (T20 World Cup 2021 Records) నమోదు చేశారు. దీంతో వారి పేర్లు టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ యూవరాజ్​ సింగ్​ సరసన చేరాయి. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

yuvraj singh
యువీ సరసన నిలిచిన మార్ష్‌, హేజిల్‌వుడ్

By

Published : Nov 15, 2021, 12:45 PM IST

ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్‌ మార్ష్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌ (T20 World Cup 2021 Records) సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలుపొందడంతో వీరిద్దరూ టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సరసన చేరారు. ఇప్పటివరకు మూడు ప్రపంచకప్‌లు (T20 World Cup 2021 Records) సాధించిన జట్లలో ఉన్న ఏకైక ఆటగాడిగా నిలిచిన యువీకి.. ఈ ఆసీస్‌ ఆటగాళ్లు తోడయ్యారు. యువీ 2000లో అండర్‌-19, 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ సాధించిన జట్లలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

తాజాగా మార్ష్‌, హేజిల్‌వుడ్‌ ఆ రికార్డును (T20 World Cup 2021 Records) చేరుకున్నారు. వీరిద్దరూ 2010లో అండర్‌-19 ప్రపంచకప్‌తో పాటు, 2015 వన్డే ప్రపంచకప్‌ సాధించారు. తాజాగా 2021 టీ20 ప్రపంచకప్‌ గెలుపొందిన జట్టులోనూ పాలుపంచుకొని అరుదైన రికార్డులో భాగమయ్యారు. మరోవైపు ఈ తుదిపోరులో ఆసీస్‌ విజయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. తొలుత బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌ కట్టుదిట్టంగా బంతులేసి 3/16 మెరుగైన ప్రదర్శన చేయగా.. ఛేదనలో మార్ష్‌ (77 నాటౌట్‌) దంచికొట్టాడు.

ఇదీ చూడండి :T20worldcup: కివీస్‌పై ఆసీస్​ విజయం.. హైలైట్స్​ చూసేయండి!

ABOUT THE AUTHOR

...view details