భారీ అంచనాలతో టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) బరిలోకి దిగిన టీమ్ఇండియా నిరాశపరిచింది. కనీసం సెమీస్ కూడా చేరుకోకుండానే నిష్క్రమించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ముందుగానే ప్రకటించిన కోహ్లీ(virat kohli captaincy news).. కెప్టెన్‌గా సోమవారం నమీబియాతో చివరి మ్యాచ్ ఆడేశాడు. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు కేఎల్ రాహుల్(kl rahul latest news) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. కెప్టెన్‌కు సరైన ఉదాహరణ విరాట్ కోహ్లీ అని ప్రశంసించాడు. టీమ్ఇండియాకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు, కోచ్ రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలిపాడు.
"టీ20 ప్రపంచకప్‌లో మేం నిరాశపరిచాం. మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. మేం ఉత్తమ క్రికెటర్లుగా ఎదిగేందుకు మాకు సహకరించిన రవిశాస్త్రికి, గెలుపోటముల్లో టీమ్ఇండియాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. నాయకుడిగా భారత జట్టును ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీకి కూడా ధన్యవాదాలు. కెప్టెన్సీకి కోహ్లీ ఉదాహరణగా నిలిచాడు."