టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా శుక్రవారం కీలక పోరులో స్కాట్లాండ్తో తలపడింది (Ind vs Scotland) టీమ్ఇండియా. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి నెట్ రన్‌రేట్ పరంగా కివీస్, అఫ్గాన్లను దాటింది. కాగా. ఈ టోర్నీలో స్కాట్లాండ్ మొదటి నుంచి మంచి పోరాట పటిమ కనబర్చింది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వెళ్లింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 14 ఓవర్ల సంపాదన.. ఆ జట్టుకు వార్షికాదాయం! - ind vs scotland
ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI news) అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుల్లో ఒకటి. కాగా ఐపీఎల్లో ఒక మ్యాచ్ 14 ఓవర్లలో వచ్చే రాబడి.. స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు వార్షికాదాయంతో సమానమని మీకు తెలుసా?
ప్రపంచంలోనే (BCCI News) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుల్లో ఒకటి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో ఒక్కో మ్యాచ్‌కు కోట్లలో ఆదాయం రాబడుతోంది. అయితే స్కాట్లాండ్ (Cricket Scotland News) వార్షిక ఆదాయానికి సమానమైన సంపదను (సుమారు రూ.19.3 కోట్లు).. బీసీసీఐ ఒక్క ఐపీఎల్ మ్యాచ్ 14 ఓవర్లలోనే (BCCI Revenue From IPL) ఆర్జిస్తోందని సమాచారం. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ట్విట్టర్లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:Ind vs scotland: చెలరేగిన భారత బౌలర్లు.. స్కాట్లాండ్ 85 ఆలౌట్