తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్- పాక్ మ్యాచ్​కు అదిరిపోయే 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే.. - T20 world cup semis qualified teams

భారత్​లో క్రికెట్​ దైవంతో సమానం. ఇక టీమ్​ఇండియా​- పాకిస్థాన్ మ్యాచ్​(IND vs PAK T20) కోసం అభిమానులు ఎంతలా వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే టీ20 ప్రపంచకప్​ టోర్నీలో జరిగిన భారత్- పాకిస్థాన్​ మ్యాచ్​కు వచ్చిన వ్యూస్​(IND vs PAK T20 viewership) చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. టీ20 చరిత్రలోనే ఏ మ్యాచ్​కు రానన్ని వ్యూస్​ ఈ మ్యాచ్​కు రావడం విశేషం.

IND vs PAK
భారత్, పాకిస్థాన్

By

Published : Nov 9, 2021, 5:18 PM IST

భారత్​- పాకిస్థాన్​ మ్యాచ్​(IND vs PAK T20) అంటే క్రికెట్​ అభిమానులకు పండగే. ఈ మ్యాచ్​ ప్రారంభమైనప్పటినుంచి ముగిసేవరకూ అభిమానులు టీవీలకే అతుక్కుపోతారు. 2021 టీ20 ప్రపంచకప్​లోనూ ఇదే జరిగింది.లీగ్​ దశలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్​కు(IND vs PAK T20 viewers) విశేష ఆదరణ లభించింది. ఏకంగా 167 మిలియన్ల (16.7 కోట్లు) మంది ఈ మ్యాచ్​ వీక్షించినట్లు అధికారిక బ్రాడ్​కాస్టర్ 'స్టార్ ఇండియా'(Star India News) తెలిపింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

"అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 24న జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్​కు రికార్డు స్థాయిలో 167 మిలియన్​ వ్యూస్ లభించాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్స్​ మ్యాచ్​కు (టీమ్​ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి," అని స్టార్​ ఇండియా తమ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

మెగా టోర్నీ మొదలైనప్పటి నుంచి సెమీస్​ క్వాలిఫయర్స్​ వరకు అన్ని మ్యాచ్​లు కలిపి 238మిలియన్ల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా స్పష్టం చేసింది. క్రికెట్ వ్యూవర్​షిప్​ను పెంచేందుకు మరింత కృషి చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్​లో తొలి మ్యాచ్​లో టీమ్​ఇండియాపై ఘన విజయం సాధించింది పాకిస్థాన్. అనంతరం వరుస విజయాలతో దూసుకెళ్లి సెమీస్​కు చేరింది. అఫ్గాన్​పై విజయం సాధించి న్యూజిలాండ్​ కూడా సెమీస్​కు చేరింది. గ్రూప్​ 1లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సెమీస్​కు చేరుకున్నాయి. 14న ఫైనల్​ జరగనుంది.

ఇదీ చదవండి:

హెడ్​కోచ్​గా ఐదేళ్లు.. రవిశాస్త్రి సాధించిన ఘనతలివే

ABOUT THE AUTHOR

...view details