టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్లతో సహా స్పిన్నర్లు కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ దళంపై సందేహాలు మొదలయ్యాయి. కాగా.. ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమ్ఇండియా(IND vs NZ T20 Match) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బౌలింగ్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్.
"టీమ్ఇండియాలో బ్యాటర్లు మాత్రమే ఉంటే సరిపోదు. మేటి స్పిన్ బౌలర్లు కూడా ఉండాలి. మ్యాచ్‌లో వారు వికెట్లు పడగొట్టాలి. అలాంటి వారినే జట్టులోకి తీసుకోవాలి."
-సంజయ్ మంజ్రేకర్, మాజీ ఆటగాడు.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన వరుణ్ 33 పరుగులు ఇవ్వగా.. జడేజా 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు కల్పిస్తే బాగుంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.