టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా నేడు (నవంబర్ 3) అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది టీమ్ఇండియా(ind vs afg t20). ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ పోరుపై స్పందించాడు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh news). చిన్న జట్టే కదా అని అఫ్గాన్‌ను తేలికగా తీసుకోవద్దని కోహ్లీసేనకు సూచించాడు. టీ20ల్లో ఫలితాన్ని ఊహించలేమని తెలిపాడు.
"అఫ్గానిస్థాన్‌ను తేలికగా తీసుకోవద్దు. ఆ జట్టు చాలా అనుభవం కలిగింది. అద్భుత బ్యాటర్లు, ముజిబుర్ రెహ్మన్, రషీద్ ఖాన్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఆ టీమ్‌లో ఉన్నారు. టీ20ల్లో ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం. తొలి 6 ఓవర్లలో ఎవరు ఆధిపత్యం వహిస్తారో వారికే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది."
-హర్భజన్ సింగ్, వెటరన్ స్పిన్నర్