స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్ట్రియానో రొనాల్డో-కోకాకోలా ఉదంతం (Ronaldo Coca Cola) ఎంతో సంచలనం సృష్టించింది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రెండు కోక్ బాటిళ్లను జరపడం మూలంగా కోకాకోలా రూ.30 వేల కోట్లు నష్టపోవడానికి కారణమయ్యాడు రొనాల్డో (Cristiano Ronaldo News). ఆ తర్వాత పలువురు క్రీడాకారులు అతడిని అనుకరించగా.. మరికొందరు కావాలనే కోక్ తాగుతూ కనిపించారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner News) వంతు వచ్చింది.
T20 World Cup 2021: రొనాల్డోలా వార్నర్.. నవ్వులు పూయిస్తూ - డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner News) ఎంత చలాకీగా ఉంటాడో తెలిసిందే. కుటుంబంతో కలిసి టిక్‌టాక్ వీడియోలు, డబ్‌స్మాష్‌లతో సామాజిక మాధ్యమాల్లో అలరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశాడు. స్టార్ ఫుట్‌బాలర్ రొనాల్డోను (Ronaldo Coca Cola) అనుకరించి నవ్వులు పూయించాడు.
టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా శ్రీలంకతో మ్యాచ్ (Australia vs Sri Lanka) అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సరదాగా రొనాల్డోను అనుకరించాడు వార్నర్. తన ముందు ఉన్న కోక్ బాటిళ్లను తీసి కింద ఉంచబోయాడు. నేను వీటిని తీసేయొచ్చా.. అని అక్కడున్న సిబ్బందిని అడిగాడు. తిరిగి పెట్టాయాలని వారు కోరగా.. "(కొంటెగా..) రొనాల్డో చేసింది సరైందే అయితే.. నేను చేయడమూ కరెక్టే" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఇదీ చూడండి:రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం