స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్(Shane Warne News) తాజాగా ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన స్టీవ్‌స్మిత్(Shane Warne Steve Smith) టీ20 జట్టులో ఉండకూడదని అన్నాడు. శనివారం(అక్టోబర్ 30) రాత్రి ఆసీస్.. ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న నేపథ్యంలో వార్న్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"జట్టు ఎంపిక బాలేదు. మార్ష్‌ను పక్కనపెట్టడం బాధ కలిగించింది. మ్యాక్స్‌వెల్ స్థానంలో స్టోయినిస్ బరిలోకి దిగాలి. మ్యాక్సీ ఎప్పుడైనా పవర్ ప్లే తర్వాతే ఆడాలి. ఆసీస్ జట్టు ప్రణాళిక కూడా బాలేదు. స్మిత్ అంటే ఇష్టమే. కానీ, అతడు టీ20 జట్టులో ఉండకూడదు. అతడి స్థానంలో మార్ష్‌ను ఎంపిక చేయాలి."
--షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(AUS vs ENG T20) తొలుత బ్యాటింగ్ చేసి 125 పరుగులకే ఆలౌటైంది. టాప్‌ఆర్డర్‌లో కెప్టెన్ ఆరోన్ ఫించ్ (44) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. డేవిడ్ వార్నర్ (1), స్టీవ్‌స్మిత్ (1), మాక్స్‌వెల్ (6), స్టాయినిస్ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు చేయడం వల్ల ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. అనంతరం ఇంగ్లాండ్ 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ (71; 32 బంతుల్లో 5x4, 5x6) దంచికొట్టాడు. ఈ నేపథ్యంలోనే వార్న్ ట్వీట్ చేస్తూ ఆసీస్ జట్టును ఎండగట్టాడు. ఈ ట్వీట్‌పై ఆసీస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. స్మిత్ ఇదొక్క మ్యాచ్‌లోనే విఫలమయ్యాడని, ఇలాంటి పనికిమాలిన సూచనలు చేయొద్దని అతడిపై మండిపడుతున్నారు.