టీ20 ప్రపంచకప్(t20 2world cup 2021)లో టీమ్ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్. కెప్టెన్గా కోహ్లీ, కోచ్గా రవిశాస్త్రి కాంబినేషన్లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్(gautam gambhir on virat captaincy).. రోహిత్ కెప్టెన్సీ, రాహుల్ ద్రవిడ్ కోచ్గా భారత్ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'ద్రవిడ్, రోహిత్ కాంబోలో భారత్ ప్రపంచకప్ గెలుస్తుంది'
టీ20 ప్రపంచకప్(t20 2world cup 2021)లో తమ ఆఖరి మ్యాచ్ను నమీబియాతో ఆడనుంది టీమ్ఇండియా. అటు కోచ్గా రవిశాస్త్రి.. ఇటు టీ20 కెప్టెన్గా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. వీరి సారథ్యంలో ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేకపోయింది జట్టు. ఇదే విషయంపై స్పందించాడు గంభీర్(gautam gambhir on virat captaincy).
గంభీర్
"కెప్టెన్గా రోహిత్(gambhir on rohit sharma), కోచ్గా ద్రవిడ్ ఈ ఫార్మాట్లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్ టైటిల్ కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని" వెల్లడించాడు గంభీర్.
ఈ ప్రపంచకప్(t20 2world cup 2021)లో భాగంగా సోమవారం (నవంబర్ 8) నమీబియాతో జరిగే మ్యాచ్ ఇటు కోచ్గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.