టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) కుడిచేయి భుజానికి గాయమైంది. అయితే.. అతడు బౌలింగ్ చేయడం ఇక కష్టమే అని అందరూ భావించారు. కానీ, బుధవారం నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్, సోహమ్ దేశామ్ ఆధ్వర్యంలో 15 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు హార్దిక్. అనంతరం.. 20-25 నిమిషాల పాటు ఫిట్నెస్ డ్రిల్స్ చేశాడు.
నెట్స్‌లో బ్యాటింగ్ స్కిల్స్‌పై కూడా ఫోకస్ చేశాడు హార్దిక్. ఈ ప్రాక్టీస్ సెషల్ భాగంగా టీమ్ఇండియా మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni Mentor).. పాండ్యకు పలు సలహాలు ఇచ్చాడు.