టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భారత్ జట్టు నిరాశపర్చింది. టోర్నీలో సెమీస్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురు కాగా.. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై విజయం సాధించింది. అయినా.. సెమీస్‌కు చేరుకోలేకపోయింది. దీంతో సోమవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో నమీబియాపై గెలుపొంది టోర్నీని విజయంతో ముగించింది. కోచ్‌గా రవిశాస్త్రి(ravi shastri t20 world cup)కి ఇదే చివరి మ్యాచ్. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన రవిశాస్త్రి.. టోర్నీలో టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకోకపోవడానికి కారణాలను వెల్లడించారు. బయోబబుల్‌లో ఉండటం.. ఐపీఎల్ ఆడిన వెంటనే ఈ మెగా టోర్నీలోకి దిగడం వల్ల భారత క్రికెటర్లు అలసిపోయారని, అందువల్లనే మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై లీగ్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చిందని తెలిపారు.
'బబుల్‌లో ఉంటే బ్రాడ్‌మన్‌కు అయినా కష్టమే' - రవిశాస్త్రి బ్రాడ్‌మన్
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది టీమ్ఇండియా. సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. కాగా, కోచ్‌గా రవిశాస్త్రి(ravi shastri t20 world cup)కి ఇదే చివరి టోర్నీ. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌తో పాటు ప్రపంచకప్‌లో వైఫల్యంపై స్పందించాడు రవి. సుదీర్ఘంగా బయోబబుల్‌లో ఉండటం వల్ల ఆటగాళ్లు అలసిపోయారని తెలిపాడు.
"భారత జట్టు ఆరు నెలలుగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బయో బబుల్(ravi shastri on bio bubble)లో ఉంటోంది. నేను మానసికంగా మాత్రమే అలసిపోయా. ఆటగాళ్లు మానసికంగా.. శారీరకంగా కూడా అలిసిపోయారు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ టోర్నీల మధ్య ఇంకాస్త ఎక్కువ వ్యవధి ఉంటే బాగుండేది. గత 24 నెలల్లో ఆటగాళ్లు కేవలం 25 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. డాన్ బ్రాడ్‌మన్ లాంటి బ్యాట్స్‌మన్ అయినా బబుల్‌లో ఉంటే సగటు పడిపోతుంది. ఎందుకంటే అతడూ మనిషే కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడిపైనా ఒత్తిడి తీసుకురాలేం. అలాగని మా వైఫల్యానికి దీన్ని కారణంగా చూపట్లేదు.. ఓటమికి భయపడట్లేదు. గెలవాలని చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి. నేను ఈ పదవి (ప్రధాన కోచ్) చేపట్టినప్పుడు టీమ్ఇండియాలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నా. కచ్చితంగా మార్పులు తీసుకొచ్చాననే భావిస్తున్నా. ఐదేళ్లలో భారత ఆటగాళ్లు అన్ని దేశాల్లో.. అన్ని రకాల ఫార్మాట్లలో రాణించిన తీరు చూస్తే.. క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప జట్టుగా నిలుస్తుంది" అని రవిశాస్త్రి(ravi shastri t20 world cup) అన్నారు.
రవిశాస్త్రి స్థానంలో బీసీసీఐ రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. టీమ్ఇండియా ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు రాహుల్ ద్రవిడ్(rahul dravid news) ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.