టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) పాకిస్థాన్ చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు (Jadeja on Kohli) అసంతృప్తికి గురిచేసినట్లు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (ajay jadeja news) చెప్పాడు. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది (Shaheen Afridi News) విధ్వం సృష్టించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ను ప్రారంభంలోనే పెవిలియన్ చేర్చిన ఈ బౌలర్.. టీమ్ఇండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాడు.
మ్యాచ్ (IND VS PAK) అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడం వల్ల వెనకడుగు వేయాల్సి వచ్చిందని కోహ్లీ (Virat Kohli News) అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల విభేదించిన జడేజా.. కోహ్లీ స్థాయి ఆటగాడు జట్టులో ఉన్నప్పుడు టీమ్ఇండియాను పోటీలోకి తీసుకురావడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని (Ajay Jadeja on Kohli) చెప్పాడు.
"ఆ రోజు కోహ్లీ చెప్పింది విన్నాను. '2 వికెట్లు పడగానే.. మ్యాచ్‌లో వెనకడుగు వేశాం' అని అన్నాడు. అది కాస్త నిరాశకు గురిచేసింది. విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్లో ఉంటే.. మ్యాచ్ ఊరికే చేజారదు. కనీసం బంతులైనా ఆడకముందే కోహ్లీ.. అలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టీమ్ఇండియా ఆలోచనా విధానాన్ని సూచిస్తోంది"
- అజయ్ జడేజా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్