టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమ్ఇండియాతో తలపడుతోంది అఫ్గానిస్థాన్. ఈ నేపథ్యంలో తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది అఫ్గానిస్థాన్.
ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో టీమ్ఇండియా ఓటమిపాలైంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు కోహ్లీసేనపై ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో సెమీస్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన భారత జట్టు తొలి విజయం కోసం ప్రయత్నం చేస్తోంది.
టీమ్ఇండియా జట్టు:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.