క్రికెట్లో టీ20 మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మ్యాచ్ ఏ దశలో ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి తరుణంలో కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే మ్యాచ్ గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఓ క్రికెటర్ ఉత్తమ టీ20 ఆటగాడిగా రాణించినప్పటికీ ఉత్తమ సారథిగా విఫలమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే టీ20ల్లో అత్యధిక విజయాలు తమ ఖాతాలో వేసుకున్న ఉత్తమ కెప్టెన్లు(Best T20 Captain) ఎవరో చూసేద్దాం..
1. ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ, అస్గర్ అఫ్గాన్‌ను వెనక్కినెట్టి అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్(Eoin Morgan T20 Captaincy Record). మొత్తం 70 మ్యాచ్‌ల్లో 43 విజయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో విజయం అనంతరం ఈ ఘనత సాధించాడు మోర్గాన్.
ఒకవేళ టీ20 ప్రపంచకప్ టైటిల్ ఇంగ్లాండ్ సొంతం చేసుకుంటే ఇయాన్ మోర్గాన్‌కు టీ20 చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
2. ఎంఎస్ ధోనీ, ఇండియా
టీమ్ఇండియా మెంటార్, భారత జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ(Dhoni Captaincy) ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్ మహీ కావడం విశేషం.
2007 నుంచి 2016 వరకు 72 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ధోనీ 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా... 28 మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాడు. 2 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. టీ20 మ్యాచ్‌ల్లో సారథిగా మహీ గెలుపు శాతం 60గా ఉంది.
3. అస్గర్ అఫ్గాన్, అఫ్గానిస్థాన్
అఫ్గానిస్థాన్ జట్టు మాజీ సారథి అస్గర్ అఫ్గాన్(Asghar Afghan Retirement) ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో చివరిసారిగా ఆడాడు. అయితే.. టీ20ల్లో కెప్టెన్‌గా సక్సెస్ అయిన జాబితాలోనూ అస్గర్ చోటు సంపాదించాడు.
అస్గర్ సారథ్యంలో 51 టీ20 మ్యాచ్‌లాడిన అఫ్గానిస్థాన్ 42 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కెప్టెన్‌గా అస్గర్ గెలుపు శాతం 81.73గా ఉంది.