పోలండ్ కీస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. మొత్తం ఐదుగురు క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మహిళల 48 కేజీల విభాగంలో గీతికా క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. కజకిస్థాన్ బాక్సర్ అరైలిమ్ మరాట్పై 5-0తో గెలుపొందింది.
ఇదీ చదవండి:'ఐపీఎల్' పండుగ ఆరంభమై నేటితో 14 ఏళ్లు
పురుషుల విభాగం నుంచి మరో నలుగురు బాక్సర్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. ఆసియా రజత పతక విజేత అంకిత్ నర్వాల్(64 కేజీ), విశ్వామిత్ర చోంగ్తమ్(49 కేజీ), సచిన్(56 కేజీ)తో పాటు విశాల్ గుప్తా(91 కేజీ) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. 64 కేజీల విభాగంలో నిషా గుర్జార్ 1-4తో పరాజయం పాలైంది. లాట్వియా బాక్సర్ బీట్రైజ్ రోజెంటాలే చేతిలో ఓడిపోయింది.
ఇదీ చదవండి:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు