తెలంగాణ

telangana

By

Published : Apr 19, 2021, 1:39 PM IST

ETV Bharat / sports

భారత బాక్సర్ల సత్తా- నాలుగు పతకాలు ఖాయం!

పోలాండ్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్​ ఛాంపియన్​షిప్​ బాక్సింగ్​ పోటీల్లో భారత బాక్సర్లు విజృంభిస్తున్నారు. నలుగురు మహిళా బాక్సర్లు సెమీస్​లోకి దూసుకెళ్లారు. దీంతో కనీసం నాలుగు పతకాలు భారత్​ ఖాతాలో చేరనున్నాయి.

youth boxing championship, vinka, alfiya, poonam
ప్రపంచ యూత్ ఛాంపియన్​ షిప్, సత్తా చాటిన భారత బాక్సర్లు

పోలాండ్​ కీల్స్ వేదికగా జరుగుతోన్న ప్రపంచ యూత్​ ఛాంపియన్​షిప్​ బాక్సింగ్​ పోటీల్లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. కనీసం నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. నలుగురు మహిళా బాక్సర్లు సెమీస్​కు అర్హత సాధించారు.

60 కేజీల విభాగంలో పానిపత్​ బాక్సర్​ విన్కా.. కొలంబియా బాక్సర్​ కమిలో కమేలాపై 5-0 తేడాతో గెలుపొందింది. 81 పైచిలుకు కేజీల విభాగంలో ఆల్ఫియా.. హంగేరీ బాక్సర్​ రేకా హాఫ్మన్​పై 5-0తో విజయం సాధించింది. ఈ ఇద్దరు బాక్సర్లు చివరి నాలుగో రౌండ్​కు అర్హత సాధించారు.

ఇదీ చదవండి:ధావన్​, పృథ్వీ విధ్వంసక బ్యాటింగ్ రహస్యాలివే..

కజకిస్థాన్ బాక్సర్​ నాజర్కే సెరిక్​పై భారత బాక్సర్​ పూనమ్​(57 కేజీ) 5-0 తేడాతో గెలుపొంది.. సెమీస్​లోకి ప్రవేశించింది. మరో భారత బాక్సర్ గీతికా(48 కేజీ).. రొమేనియా బాక్సర్​ ఎలిజబెత్​ ఒస్టాన్​పై విజయం సాధించింది. బలమైన పంచులతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది ఈ హరియాణా బాక్సర్​. దీంతో తొలి రౌండ్​ అనంతరం గీతికాను విజేతగా ప్రకటించారు.

81 కేజీల విభాగంలో మరో మహిళా బాక్సర్ కృషి.. క్వార్టర్​ ఫైనల్లో పరాజయం చవిచూసింది. టర్కీ బాక్సర్​ బుస్రా ఇసిల్దార్​ విజయం సాధించింది.

ఇక పురుషుల విభాగంలో మనీష్​(75 కేజీ), సుమిత్​(69 కేజీ) క్వార్టర్​ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

ఇదీ చదవండి:ఆ క్రికెటర్లతో పాటు వార్నర్​, విలియమ్సన్ ఉపవాసం

ABOUT THE AUTHOR

...view details