Wrestlers Protest : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)తో పోరాటం ఇక నుంచి కోర్టులో చేస్తామని.. రోడ్లపై కాదని రెజ్లర్లు తెలిపారు. బ్రిజ్ భూషన్ సింగ్‌పై ఛార్జిషీటు దాఖలు చేస్తామన్న ప్రభుత్వం.. తమ మాట నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు వివేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. అనంతరం కొద్ది సేపటికే తాము సోషల్ మీడియా నుంచి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు వినేస్ ఫొగాట్, సాక్షి మాలిక్ ప్రకటించారు.
Wrestlers Protest Update : 'జూన్ 7న జరిగిన సమావేశంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు దీల్లీ పోలీసులు ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు పూర్తి చేసి జూన్ 15న ఛార్జిషీట్ దాఖలు చేశారు. మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కోర్టులో కొనసాగుతుంది. వీధుల్లో కాదు. మాకు హామీ ఇచ్చిన ప్రకారం.. జులై 11న జరగనున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయంలో ప్రభుత్వం వాగ్దానాల అమలు కోసం వేచి చూస్తాం' అని రెజ్లర్లు ట్విట్టర్ పోస్టులు పెట్టారు.
WFI ఎన్నికలు వాయిదా.. గువాహటి హైకోర్టు స్టే..
జులై 11న జరగనున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలపై గువాహటి హైకోర్టు స్టే విధించింది. అసోం రెజ్లింగ్ అసోషియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమ సంఘానికి డబ్ల్యూఎఫ్‌ఐ గుర్తింపు గల సంఘంగా ఉండే హక్కు ఉన్నా.. ఆ గుర్తింపును ఇవ్వలేదని డబ్ల్యూఎఫ్‌ఐ, ఐఓఏ అడ్‌హక్ కమిటీ, క్రీడా మంత్రిత్వ శాఖలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌లో అసోం రెజ్లింగ్ అసోషియేషన్ పేర్కొంది. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు రాష్ట్ర సంఘాలు ఇద్దరు ప్రతినిధుల పేర్లు పంపడానికి చివరి తేదీ ఈ నెల 25తో ముగిసింది. తమ సంఘానికి గుర్తింపు ఇచ్చి, ప్రతినిధుల పేర్లను పంపడానికి అనుమతివ్వాలని.. లేదంటే ఎన్నికలను నిలిపివేయాలని అస్సాం సంఘం కోరిన నేపంథ్యంలో కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జులై 17న జరగనుంది.
ఆరుగురికి మినహాయింపు..
ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ సెలెక్షన్ ట్రయల్స్‌లో ఆరుగురు రెజ్లర్లకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ వ్యాఖ్యలను ఖండించారు ప్రస్తుతం నిరసన తెలుపుతున్న స్టార్ రెజ్లర్లు. తాము స్వతహాగా ట్రయల్స్ నుంచి మినహాయింపు కల్పించమని ఎవరినీ(ఐఓఏ)ను కోరలేదని.. ఒకవేళ అలా డిమాండ్ చేశామని నిరూపిస్తే పూర్తిగా రెజ్లింగ్ ఆట నుంచి తప్పుకుంటాం అంటూ భారత స్టార్ రెజ్లర్లు తేల్చిచెప్పారు.
ఆ విషయాన్ని వివరిస్తూ.. తాము సెలక్షన్స్ ట్రయల్స్ నుంచి మినహాయింపును కోరలేదని.. కేవలం ఆటకు సన్నద్ధం కావడానికి మాత్రమే సమయం అడిగినట్లు సాక్షిమాలిక్ తెలిపింది. 'మేము ఎవరి హక్కులకు భంగం కలిగించలేదు. ఆరు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నందునే ప్రాక్టీస్ కోసం కాస్త గడువు కావాలని సమాఖ్య పెద్దలను అడిగాం. దయచేసి దీనిని తప్పుగా ప్రచారం చేయొద్ద' అని ఆమె కోరింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.