భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 53 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఉక్రెయిన్‌లోని కైవ్ వేదికగా జరిగిన 24వ ఔట్‌స్టాండింగ్ రెజ్లర్స్ అండ్ కోచెస్ మొమోరియల్ పోటీల్లో.. బెలూరస్ రెజ్లర్ వెనెసా కలాడ్జిన్స్కాయపై గెలుపొందింది. లాక్డౌన్ తర్వాత వినేశ్ గెలుపొందిన తొలి మెడల్ ఇదే.
రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్ - Ukrainian
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్ రెజ్లర్ వెనెసాపై విజయం సాధించింది.

రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్
వినేశ్ విజయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ట్వీట్ చేసింది. టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు ఆమె ఇప్పటికే అర్హత సాధించింది.
ఇదీ చదవండి:టెస్టు ర్యాంకింగ్స్: రోహిత్ కెరీర్ బెస్ట్, అశ్విన్@3