దిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ హత్య కేసు(Wrestler Sagar Murder)లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్(Sushil Kumar). ఈ కేసులో భాగమైన కారణంగా సుశీల్‌కు సంబంధించిన ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రక్రియను ఆయుధాల లైసెన్స్ జారీ చేసే విభాగం మొదలుపెట్టినట్లు వెల్లడించారు.
Sushil Kumar: సుశీల్ ఆయుధ లైసెన్స్ రద్దు - రెజ్లర్ సాగర్ హత్య కేసు
రెజ్లర్ సాగర్ హత్య కేసు(Wrestler Sagar Murder)లో దిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్(Sushil Kumar) ఆయుధ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
![Sushil Kumar: సుశీల్ ఆయుధ లైసెన్స్ రద్దు Wrestler Sushil Kumar's arms license suspended, says Delhi Police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11974609-828-11974609-1622530176069.jpg)
ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును దిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. సుశీల్ పరారీలో ఉన్నప్పుడు అతనికి సహాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సాగర్ హత్య కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించగా.. ఇప్పటివరకు వారిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత 18 రోజుల ఏడు రాష్ట్రాలను దాటుకొని.. సిమ్‌కార్డులను తరచుగా మార్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న సుశీల్ నేరాలు!