తెలంగాణ

telangana

ETV Bharat / sports

లొంగిపోవడానికి సిద్ధపడ్డ రెజ్లర్​ సుశీల్​ కుమార్! - ఛత్రశాల్ స్టేడియం

మల్లయోధుడు సాగర్ రానా హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్.. లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తన పేరు తప్పించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

sushil kumar, indian star wrestler
సుశీల్ కుమార్, భారత స్టార్ రెజ్లర్

By

Published : May 17, 2021, 6:59 PM IST

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రముఖ రెజ్లర్​ సుశీల్​ కుమార్​ ఎట్టకేలకు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తన పేరు తొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మల్లయోధుడు సాగర్​ రానా హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న సుశీల్​ కోసం పోలీసులు గత కొన్నిరోజుల నుంచి గాలిస్తున్నారు. ఇప్పటికే నాన్​ బెయిలబుల్​ వారెంట్​ కూడా జారీ చేసింది దిల్లీ కోర్టు. రెజ్లర్​ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు పారితోషికం కూడా ప్రకటించారు దిల్లీ పోలీసులు. దీంతో లొంగిపోవడం తప్పితే సుశీల్​కు మరో మార్గం కనిపించట్లేదు.

సుశీల్​ మామయ్యతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నించారు. డిప్యూటేషన్​పై ఛత్రశాల్​ స్టేడియంలో పనిచేస్తున్నందున అతడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరారు.

ఏం జరిగింది?

దిల్లీలోని ఛత్రశాల్​ స్టేడియంలో ఈ నెల 4న జరిగిన గొడవలో సాగర్ రానా అనే మల్లయోధుడు మరణించాడు. అతడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడిలో నిందితుడు సుశీల్​ కుమార్​ అని బాధితులు పేర్కొన్నారు. అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా ఏర్పడి వెతుకుతున్నారు.

ఇదీ చదవండి:'విజయ్.. నీ బ్యాట్​ కంటే నోరే ఎక్కువ మాట్లాడుతుంది'

ABOUT THE AUTHOR

...view details