తెలంగాణ

telangana

ETV Bharat / sports

Sushil Kumar: రెజ్లర్​ సాగర్​పై దాడి దృశ్యాలు! - రెజ్లర్​ సాగర్​ను హత్య చేసిన వీడియో!

హత్య కేసులో భాగంగా రెజ్లర్​ సుశీల్​ కుమార్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ హత్యకు సంబంధించినవిగా పేర్కొంటూ వీడియో, ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

wrestler-sushil-kumar-video-beating-sagar-dhankar-in-chhatrasal-stadium-delhi
Sushil Kumar: రెజ్లర్​ సాగర్​ను హత్య చేసిన వీడియో!

By

Published : May 27, 2021, 11:01 PM IST

యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో అరెస్టయిన దిగ్గజ రెజ్లర్‌ సుశీల్‌ (sushil kumar)పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియో అంటూ కొన్ని చిత్రాలు వైరల్​ అయ్యాయి. రోడ్డుపై పడి ఉన్న వారిని కొంత మంది వ్యక్తులు కర్రలతో కొడుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. దాడి చేస్తున్న బృందంలో ఉన్నది సుశీల్ కుమారేనని నెట్టింట ప్రచారం జరుగుతోంది.

వైరల్​ వీడియో
వైరల్​గా మారిన ఫొటో

ఏం జరిగిందంటే?

ఈ నెల 4న దిల్లీలో జరిగిన దాడిలో 23 ఏళ్ల సాగర్‌ దంకడ్‌ అనే జాతీయ స్థాయి రెజ్లర్‌ మరణించాడు. ఆ తర్వాత సుశీల్‌ కుమార్‌ కనిపించకుండా పోయాడు. ఛత్రశాల స్టేడియం ప్రాంగణంలో సాగర్‌తో పాటు అతడి మిత్రులైన సోను మహల్‌, అమిత్‌ కుమార్‌లపై జరిగిన దాడిలో సుశీల్‌తో పాటు అతడి మిత్రులు కొందరు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

తమపై దాడికి పాల్పడింది సుశీల్‌, అతడి మిత్రులే అని గాయపడ్డ ఓ బాధితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుల్లో ఒకడైన రెజ్లర్‌ ప్రిన్స్‌ దలాల్‌ను తొలుత పోలీసులు అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించగా.. దాడికి పాల్పడ్డపుడు తీసిన వీడియో దొరికింది. అందులో స్వయంగా సుశీల్‌ బాధితులపై దాడికి పాల్పడ్డ దృశ్యం కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు.

సుశీల్‌తో ఒకప్పుడు సాగర్‌కు మంచి సంబంధాలే ఉండేవి. దిల్లీలోని మోడల్‌ టౌన్‌లో సుశీల్‌ ఇంటిలోనే సాగర్‌ అద్దెకు ఉండేవాడు. అయితే కొన్ని నెలల పాటు అద్దె చెల్లించకపోవడం వల్ల అతడితో సుశీల్‌కు గొడవ జరిగింది. నాలుగు నెలల క్రితం సాగర్‌ ఇల్లు ఖాళీ చేశాడు. అయితే గొడవ సందర్భంగా సుశీల్‌ను దూషించిన సాగర్‌.. ఇతరుల ముందు అతడి గురించి అవమానకరంగా మాట్లాడేవాడట. ఇది తట్టుకోలేక సుశీల్‌ బృందం సాగర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:Sushil Kumar: గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలపై మౌనం

ABOUT THE AUTHOR

...view details