భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ 125 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరాడు. దీంతో అతడు ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హత సాధించాడని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ప్రకటించింది.
"సుమిత్ మాలిక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతోన్న ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ 125 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి విశ్వక్రీడల్లో ఆడేందుకు అర్హత సాధించాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏడో రెజర్ల్గా.. నాలుగో పురుష రెజర్ల్గా సుమిత్ మాలిక్ నిలిచాడు".
- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా