తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిఫరీపై దాడి.. భారత రెజ్లర్​పై జీవిత కాల నిషేధం.. - రెజ్లర్​ సతేందర్​ మాలిక్​పై జీవిత కాల నిషేధం

Life ban on wrestler Satender Malik: ఇకపై ఏ పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా భారత రెజ్లర్​ సతేందర్​ మాలిక్​పై జీవిత కాల నిషేధం విధించింది రెజ్లింగ్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా. కామన్వెల్త్​ 2022 ట్రయల్స్​లో ఓ రిఫరీపై అతడు దాడి చేయడమే ఇందుకు కారణం.

Wrestler Satender Malik life ban
రిఫరీపై దాడి.. భారత రెజ్లర్​పై జీవిత కాల నిషేదం..

By

Published : May 17, 2022, 8:13 PM IST

Life ban on wrestler Satender Malik: భారత రెజ్లర్​ సతేందర్​ మాలిక్​పై జీవిత కాల నిషేధం విధించారు. పోటీలు జరుగుతున్న సమయంలో ఓ రిఫరీతో అనుచితంగా ప్రవర్తించడం సహా అతడిపై దాడి చేయడం వల్ల రెజ్లింగ్ ఫెడరేషన్​ ఆఫ్ ఇండియా ఈ శిక్ష విధించింది.

ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్​ క్రీడలు ఇంగ్లాండ్​లోని బర్మింగ్​హామ్​ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే జట్ల ఎంపిక కోసం భారత్​లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో 125 కేజీల విభాగంలో సర్వీసెస్​ జట్టుకు చెందిన రెజ్లర్​ సతేందర్​ మాలిక్​ ఓడిపోయాడు. ఈ క్రమంలోనే మ్యాచ్​ ఫలితం తనకు వ్యతిరేకంగా రావడంతో సహనం కోల్పోయిన అతడు సీనియర్​ రిఫరీ జగ్బీర్​ సింగ్​పై చేయి చేసుకున్నాడు. దీన్ని ఖండించిన రెజ్లింగ్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఇండియా.. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేపథ్యంలో అతడిపై చర్యలు తీసుకుని నిషేధం విధించింది.

కాగా, ఈ ట్రయల్స్​లో రవి దహియా(57 కేజీ), బజరంగ్​ పునియా(65 కేజీ), నవీన్​(74 కేజీ), దీపక్ పునియా(86 కేజీ), దీపక్​(97 కేజీ), మోహిత్​ దహియా(125 కేజీ) సెలెక్ట్​ అయ్యారు.

ఇదీ చూడండి:సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్​.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్​లో!

ABOUT THE AUTHOR

...view details