తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దంగల్' కుటుంబంలో పెళ్లి సందడి - babita phogat marriage news

ప్రముఖ రెజ్లర్​ బబితా ఫొగాట్​, వివేక్​ల​ వివాహం నేడు జరగనుంది. హరియాణాలోని చర్కీ దాద్రీలో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. శనివారం మెహందీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

wrestler-politician Babita Phogat  mehandi program completed, marrying Vivek Suhag on December 1
పెళ్లి కూతురైన బబితా ఫోగాట్... నేడు వివాహం​

By

Published : Dec 1, 2019, 10:23 AM IST

భారత స్టార్​ రెజ్లర్​ బబితా ఫొగాట్​ పెళ్లికూతురైంది. శనివారం మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు (డిసెంబర్​ 1) వివేక్​తో ఆమె వివాహం జరగనుంది. చర్కీ దాద్రీలో బబిత స్వగృహం వద్ద కార్యక్రమం వైభవంగా నిర్వహించనున్నారు. పెళ్లికి తయారవుతున్న ఫొటోలను సోషల్​ మీడియా వేదికగా పంచుకుందీ స్టార్​ ప్లేయర్.

డిసెంబర్​ 2న దిల్లీలో రిసెప్షన్​ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​ షా, పలువురు కేంద్ర మంత్రులు, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​, రాష్ట్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు ఒలింపిక్స్​ వెండిపతక విజేత సుశీల్​ కుమార్​, మహిళా రెజ్లర్​ సాక్షి మాలిక్​, కోచ్​లు, విదేశీ క్రీడాకారులకు వివాహ ఆహ్వానం అందజేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కెరీర్​ విశేషాలు...

2010, 2012 కామన్వెల్త్​ క్రీడల్లో వరుసగా వెండి, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది బబిత. 2013లో హరియాణా ప్రభుత్వం ఆమెను సబ్​ ఇన్​స్పెక్టర్​గా నియమించింది. ఆ తర్వాత 2014, 2018లో జరిగిన కామన్వెల్త్​ క్రీడల్లో బంగారు పతకాలు సాధించింది.

బబిత కుటుంబంలో ఆమెతో కలిపి నలుగురు పహిల్వాన్లు ఉండటం విశేషం. మరో ప్రముఖ రెజ్లర్​ గీతా ఫొగాట్​ ఆమెకు సోదరి. వీరిద్దరి జీవిత చరిత్ర ఆధారంగా 'దంగల్'​ సినిమా తెరకెక్కింది. ఆమిర్ ఖాన్​ ఇందులో కీలకపాత్ర పోషించాడు.

ఈ ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసింది రెజ్లర్​ బబితా ఫొగాట్​. దాద్రీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఈ క్రీడాకారిణి.. ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి సంబీర్​ సాంగ్వాన్​ చేతిలో ఓటమిపాలైంది.

ABOUT THE AUTHOR

...view details