నిరుపేద కుటుంబంలో పుట్టినా.. తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో తాను కన్న కలలను నిజం చేసి చూపించారు ఖశబా దాదాసాహెబ్ జాదవ్. ఆయన రెజ్లింగ్‌లో దిట్ట. జాదవ్ రింగ్‌లోకి దిగితే.. ప్రత్యర్థులకు హడలే. ఆయన ప్రతిభకుగాను 1952 సమ్మర్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. అదే ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి.. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.
ఒలింపిక్స్‌కు అవకాశం ఎలా?
ఖశబా దాదాసాహెబ్ జాదవ్ మహారాష్ట్ర సతారాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. జాదవ్ తండ్రి దాదాసాహెబ్ జాదవ్ ఓ రెజ్లర్. తండ్రి స్ఫూర్తితో ఐదేళ్లకే రెజ్లింగ్ నేర్చుకోవటం ప్రారంభించారు. 8ఏళ్ల వయసులోనే.. తోటి రెజ్లర్‌ను రెండు నిమిషాల్లో ఓడించి సత్తా చాటాడు. అయితే.. ఒలింపిక్స్‌లో బెర్తు కోసం చాలా కష్టాలే పడ్డాడు జాదవ్. 5.5 అడుగుల ఎత్తున్న జాదవ్.. అప్పటి భారత ఫ్లైవెయిట్ ఛాంపియన్,6 అడుగులకు పైగా ఉన్న, బంగాల్‌కు చెందిన నిరంజన్ దాస్‌ను ఓడించి చరిత్ర సృష్టించారు. దీంతో 1952 హెల్సింకి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
గ్రామస్థుల అండతో..
ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు జాదవ్ దగ్గర డబ్బులేదు. దీంతో గ్రామస్థులే అన్నీ తామై.. రూ. 8 వేలు పోగు చేసి ఒలింపిక్స్‌కు పంపించారు. హెల్సింకిలో జరిగిన 1952 సమ్మర్ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. కాంస్య పతకాన్ని సాధించారు. దీంతో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు.
150 ఎడ్లబండ్లతో ఊరేగింపు..