భారత్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడా కార్యక్రమాలు పునఃప్రారంభించే అంశంపై రాష్ట్రాలు తొందర పడొద్దని బుధవారం క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దేశవ్యాప్తంగా క్రీడా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే అవకాశాలపై సమీక్షించిన రిజిజు.. మరో రెండు, మూడు నెలల వరకు వీటి గురించి ఆలోచించకుండా ఉండటమే మంచిదని పేర్కొన్నారు.
"క్రీడా కార్యకలాపాలు, ఆటగాళ్లకు శిక్షణను ప్రారంభించే విషయంపై రాష్ట్రాలకు స్వతంత్ర నిర్ణయం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి మరో 3 నెలల తర్వాతే వీటి నిర్వహణపై దృష్టి సారించాలని నేను కోరుతున్నా."
-కిరణ్ రిజిజు, క్రీడా శాఖ మంత్రి