తెలంగాణ

telangana

ETV Bharat / sports

తెలుగమ్మాయి భళా: కెయిన్స్​ కప్ విజేతగా కోనేరు హంపి - Koneru Humpy Cairns Cup,

తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి.. మరో మెగా టైటిల్​ గెలిచింది. తాజాగా అమెరికాలో జరిగిన కెయిన్స్​ కప్​ చెస్​ టోర్నీలో ఈ అమ్మడు.. విజేతగా నిలిచింది. పెళ్లయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ చెస్​ మాస్టర్​.. రెండు నెలల్లోనే రెండుసార్లు ఛాంపియన్​గా నిలవడం విశేషం.

Koneru Humpy news
కెయిన్స్​ కప్ విజేత తెలుగమ్మాయి కోనేరు హంపి

By

Published : Feb 17, 2020, 12:07 PM IST

Updated : Mar 1, 2020, 2:41 PM IST

అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ వేదికగా జరిగిన కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నీలో... భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి విజేతగా నిలిచింది. సోమవారం మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికతో జరిగిన తొమ్మిది, పదో రౌండ్లను డ్రా చేసుకుంది. ఫలితంగా 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి.. ట్రోఫీ కైవసం చేసుకుంది హంపి.

కెయిన్స్​ కప్ విజేత కోనేరు హంపి

ప్రపంచ ఛాంపియన్​ వెన్​జున్​ 5.5 పాయింట్లతో రెండో స్థానం, అలెగ్జాండ్రా 5 పాయింట్లతో మూడో ర్యాంక్​లో నిలిచింది. హారిక 4.5 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచింది.

కెయిన్స్​ కప్​ పాయింట్ల పట్టిక

ప్రపంచ ర్యాంకింగ్స్​@2

తాజా విజయంతో 45 వేల అమెరికా డాలర్ల ప్రైజ్​మనీ గెల్చుకుంది హంపి. అంతేకాకుండా ఈమె ఖాతాలో 5 ఈఎల్​వో రేటింగ్​ పాయింట్లు చేరాయి. ఇవి అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్​ మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుత ప్రదర్శనతో ప్రపంచ రెండోర్యాంక్​నూ త్వరలోనే అందుకోనుంది హంపి. త్వరలో ఇటలీ వేదికగా మే నెలలో జరగనున్న గ్రాండ్​ ప్రిక్స్​లో ఈమె ఆడనుంది.

రెండు నెలల్లో మరో టైటిల్​...

పునరాగమనంలో కోనేరు హంపి.. అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆరంభంలోనే మొనాకో గ్రాండ్‌ప్రి చెస్‌ రన్నరప్​గా నిలిచిన ఈ తెలుగమ్మాయి... ఆ తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్​లో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ పతకం అందించిన తొలి మహిళా చెస్​ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మాస్కో వేదికగా ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్​షిప్​లోనూ మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.

Last Updated : Mar 1, 2020, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details