తెలంగాణ

telangana

ETV Bharat / sports

World Athletics Championships 2023 : చోప్రా ముందు మరో అతి పెద్ద లక్ష్యం.. సాధిస్తాడా? - ప్రపంచ​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ 2023

World Athletics Championships 2023 Neeraj Chopra Final : ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ భారత స్టార్​ జావెలిన్​ త్రోయర్​ ముంగిట మరో పెద్ద లక్ష్యం నిలిచింది. ఇందులో అతడు గెలవాలని భారత ఆశలు పెట్టుకుంది. ఆ వివరాలు..

World Athletics Championships 2023 : చోప్రా ముందు మరో అతి పెద్ద లక్ష్యం.. సాధిస్తాడా?
World Athletics Championships 2023 : చోప్రా ముందు మరో అతి పెద్ద లక్ష్యం.. సాధిస్తాడా?

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 7:50 AM IST

World Athletics Championships 2023 Neeraj Chopra Final : ఒలింపిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఏదో ఒక మెడల్​ వస్తే చాలనుకున్న సమయంలో.. రెండేళ్ల కిందట ఏకంగా గోల్డ్​ మెడల్​ సాధించి అందరూ తనవైపు తిరిగి చూసేలా చేశాడు. అతడే భారత స్టార్​ జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా. గోల్డ్ మెడల్​ సాధించాక కూడా అతడు తన ఆటను నిలకడ కొనసాగిస్తూ అద్భుత విజయాలతో వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు. కెరీర్​లో ఉన్నత స్థాయిలో కొనసాగుతూ​ ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడీ యోధుడి ముంగిట మరో పెద్ద లక్ష్యం నిలిచింది.

అదే.. వరల్డ్​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్(World Athletics Championships 2023)​. ఈ పతకం అతడిని ఊరిస్తోంది. నిరుడు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సిల్వర్​ మెడల్​ దక్కించుకున్న నీరజ్​.. ఈసారి ఎలాగైనా గోల్డ్ మెడల్​ సాధిస్తాడని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. అలాగే నీరజ్​ కూడా పట్టుదలతో ఉన్నాడు. మరి నీరజ్‌ అభిమానుల నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా నీరజ్​ ఎప్పుడూ.. తనపై పెట్టుకున్న అంచనాలను మించి ప్రదర్శన చేస్తుంటాడు. టోక్యో ఒలింపిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా గోల్డ్ మెడల్​ దక్కించుకున్న అతడు.. ఆ తర్వాత డైమండ్‌ లీగ్‌లోనూ స్వర్ణాన్ని ముద్దాడాడు. అలానే నిరుడు వరల్డ్​ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్​ సాధించాడు. అలా ఈ సారి వరల్డ్​ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్​పై కన్నేశాడు.

క్వాలిఫయింగ్‌లో ఈ భారత యోధుడి ప్రదర్శన చూశాక గోల్డ్​మెడల్​పై భారత అభిమానులు ఆశలు మరింత ఎక్కువైపోయాయి. కేవలం ఒకే త్రోతో 88.77 మీటర్ల దూరం బల్లెంను విసిరి డైరెక్ట్​ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ పెర్​ఫార్మెన్స్​తో గ్రూప్‌లో అగ్రస్థానం అందుకోవడంతో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్తు కూడా సంపాదించాడు. ఇక ఇదే క్వాలిఫైయింగ్​లో నీరజ్‌కు అడ్డంకిగా నిలుస్తారనుకున్న జులియన్‌ వెబర్‌ (82.39 మీ), వాద్లెచ్‌ (83.50 మీ) కూడా నీరజ్​ను అధిగమించలేకపోయారు. మరో ప్రధాన ప్రత్యర్థి అర్షద్‌ నదీమ్‌ (86.79) మాత్రమే మెరుగైన ప్రదర్శన చేయగలిగాడు. చూడాలి మరి ఇప్పుడు నీరజ్​ ఈ ఫైనల్లో ఎంతవరకు రాణిస్తాడో.. ప్రత్యర్థులు ఎలాంటి సవాళ్లను విసురుతాడో, అభిమానులను నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడతాడో...

Neeraj Chopra Paris Olympics : నీరజ్ చోప్రా భళా.. పారిస్​ ఒలింపిక్స్​కు అర్హత

డైమండ్‌ లీగ్‌లో సత్తా చాటిన నీరజ్‌ చోప్రా.. అగ్రస్థానం కైవసం

ABOUT THE AUTHOR

...view details