తెలంగాణ

telangana

ETV Bharat / sports

అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు

'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​' పోటీలకు సర్వం సిద్ధమైంది. వినూత్న ఆలోచనలు మరెన్నో అద్భుతాలతో వీటిని నిర్వహించబోతోంది ఖతార్ ప్రభుత్వం. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అథ్లెటిక్స్: వినూత్న ఆలోచనలు.. మరెన్నో అద్భుతాలు

By

Published : Sep 26, 2019, 8:36 PM IST

Updated : Oct 2, 2019, 3:35 AM IST

ఖతార్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది 'ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్'. దాదాపు 16 ఏళ్ల తర్వాత, ప్రముఖ స్ప్రింటర్ బోల్ట్ లేకుండా జరుగుతున్న క్రీడలు ఇవే. ఇప్పటికే క్రీడాకారులందరూ సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఈసారి మెరుపులు మెరిపించేదెవరు, పతకాలు కొట్టేదెవరో చూడాలి.

బోల్ట్​ను భర్తీ చేసేది అతడేనా..?

100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్​కు తిరుగుండదు. అయితే ఈ టోర్నీలో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాకు చెందిన కోల్​మన్.. ఈసారి ఈ విభాగంలో విజేతగా నిలుస్తాడనేది విశ్లేషకుల అంచనా. గత మూడేళ్ల పాటు 100 మీటర్ల పరుగులో అత్యుత్తమ టైమింగ్ కోల్​మన్​దే కావడం ఇందుకు ప్రధాన కారణం.

ఈసారి అంతా సరికొత్తగా..!

ఈ పోటీల్లో చాలా మంది కొత్త అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. గత ఛాంపియన్​షిప్​లో గెలిచిన కొందరు.. ఈసారి తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. 100 మీటర్ల పురుషుల విభాగంలో కోల్​మన్, మహిళల్లో దినా యాషర్ స్మిత్.. 200 మీటర్ల మహిళల విభాగంలో మైకేల్ నార్మన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మిగిలిన వారిలో క్యూబా లాంగ్ జంప్ స్టార్ జువాన్ ఎచెవరియా, స్వీడన్ డిస్కస్ త్రోయర్ డేనియల్ స్టాల్ ఉన్నారు.

లాంగ్ జంప్​ చేస్తున్న క్రీడాకారుడు

పురుషులు, మహిళలు కలిసి..?

ఈ ప్రపంచకప్​లో సరికొత్తగా కనిపించనుంది 4x400 మీటర్ల మిక్స్​డ్ రిలే పరుగు. ఇంతకు వరకు లేని విధంగా పురుషుల, మహిళలు కలిసి జట్టుగా బరిలోకి దిగనున్నారు. ఇందులో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉంటారు. ఎవరు ముందు, ఎవరు వెనుక అనేది వారిష్టం. ఈ ఈవెంట్​ను ప్రపంచ ఛాంపియన్​షిప్​లో తొలిసారి ప్రవేశపెడుతున్నారు.

వారికి పెద్ద పరీక్షే..!

ప్రపంచంలో అత్యధికులు వీక్షించే ఫిపా ప్రపంచకప్​కు 2022లో ఆతిథ్యమివ్వనుంది ఖతార్. ఆ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు.. వారి నిర్వహణ సామర్థ్యానికి ఇది పెద్ద పరీక్ష. ఇటీవలే జరిగిన ప్రపంచకప్​ క్వాలిఫయింగ్ టోర్నీ సందర్భంగా కొన్ని లోపాలు తలెత్తాయి. మ్యాచ్​ వీక్షణలో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో ఈ పోటీలను సమర్థంగా నిర్వహించి, ఆతిథ్యం విషయంలో భయాలకు తెరదించాలని భావిస్తోంది.

పోటీలకు అతిథ్యమిస్తోన్న ఖతార్ స్టేడియం

క్రీడాకారులకు చల్లచల్లగా..!

పోటీలకు ఆతిథ్యమిస్తోన్న ఖతార్​లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. 40 నుంచి 50 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉంది. అలా ఉంటే క్రీడాకారులతో పాటు వీక్షకులకు కష్టమే. అందుకే స్టేడియంలో భారీ ఎత్తున ఎయిర్ కండిషనర్స్​ ఏర్పాటు చేస్తున్నారు. వలయాకారంలో ఉన్న ఈ యంత్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్​షిప్​ మస్కట్

ఇది చదవండి: పరుగుల రాణి పీటీ ఉషకు అరుదైన గౌరవం

Last Updated : Oct 2, 2019, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details